- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గోల్డ్ లోన్లు ఇవ్వొద్దని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ ఆదేశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. బంగారు రుణాలకు సంబంధించి మంజూరు, పంపిణీ, విక్రయించడం వంటి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. బంగారు రుణాల విభాగంలో లోపాలను గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఇతర రుణాల పోర్ట్‌ఫోలియో, రుణాల రికవరీపై ఎటువంటి ఆంక్షలు లేవు. 2023, మార్చి 31న చేపట్టిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ తనిఖీల్లో కంపెనీ గోల్డ్ లోన్ విభాగంలో లోపాలు ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సమయంలో, వాటిని వేలం వేసే సమయంలో బంగారం స్వచ్ఛత, బరువుల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఆర్‌బీఐ గుర్తించింది. ఇది నిబంధనలను ఉల్లంఘించడం, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమే. ప్రత్యేకంగా ఆడిట్ చేపట్టిన తర్వాత ఆంక్షల విషయంలో సమీక్ష జరపనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే వ్యాపారంపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆర్‌బీఐ వెల్లడించింది.