RBI: నాలుగు ఎన్‌బీఎఫ్‌సీలపై నిషేధం విధించిన ఆర్‌బీఐ

by S Gopi |
RBI: నాలుగు ఎన్‌బీఎఫ్‌సీలపై నిషేధం విధించిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 21 నుంచి రుణాలకు సంబంధించి మంజూరు, పంపిణీ నిలిపేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. నిషేధం విధించిన ఎన్‌బీఎఫ్‌సీల్లో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్, ఆరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎంఐ ఫైనాన్స్, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్‌కు చెందిన నవీ ఫిన్‌సర్వ్ ఉన్నాయి. ఆయా కంపెనీలు వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేటు(డబ్ల్యూఏఎల్ఆర్) ఆధారంగా వడ్డీ రేట్ల అమలు, కంపెనీల నిధుల వ్యయానికి సంబంధించి సూపర్‌వైజరీ ఉల్లంఘనలు జరగడాన్ని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ కారణంగా కంపెనీలు తమ కస్టమర్లకు సేవలందించకూడదని, రుణాల రికవరీ ప్రక్రియలో ముందుకెళ్లకూడదని ఆర్‌బీఐ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed