- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: పెరుగుతున్న కుటుంబాల ఆర్థిక పొదుపు: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆదాయంతో కుటుంబాలు తమ ఆర్థిక ఆస్తులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర మంగళవారం తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఫైనాన్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. దేశంలో నికర కుటుంబ(గృహాల)పొదుపులు ఊపందుకున్నాయి, ఈ ధోరణి రెండేళ్ళలో రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయి నుండి పునరుద్ధరణకు దారితీస్తోంది. 2011 నుండి 2017 మధ్యకాలంలో కుటుంబ పొదుపులు సగటున 10.6 శాతం నుండి 2017-23లో మహమ్మారి సంవత్సరాలను మినహాయించి 11. 5 శాతానికి పెరిగాయని చెప్పారు.
దేశీయ పొదుపులు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి అవసరాలకు నిధులు సమకూరుస్తాయి, బాహ్య ఫైనాన్సింగ్ ద్వారా ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తాయని డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం పెరగడం, విదేశీ మూలధనాన్ని గ్రహించే సామర్థ్యం పెరగడం వలన, బాహ్య ఫైనాన్సింగ్ గణనీయమైన మార్పులకు లోనవుతుందన్నారు. కుటుంబాలు ముందుజాగ్రత్త చర్యగా తమ ఆర్థిక ఆస్తులను ఎక్కువగా హౌసింగ్ వంటి భౌతిక ఆస్తులకు మళ్లిస్తున్నారు. భౌతిక పొదుపులు 2010-11లో జీడీపీలో 16 శాతం గరిష్ట స్థాయికి చేరుకుందని పాత్రా పేర్కొన్నారు. అదే కరోనా మహమ్మారి అనంతర సంవత్సరాల్లో భౌతిక పొదుపులు జీడీపీలో 12 శాతానికి పైగా పెరిగాయి