- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Banks: లోన్‌లు, డిపాజిట్ల వృద్ధి మధ్య అంతరంపై బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరిక
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ సమస్యను నివారించేందుకు బ్యాంకులు క్రెడిట్, డిపాజిట్ల వృద్ధి మధ్య ఉన్న అంతరాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మంగళవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా యువత అనేక అవకాశాలను అందుకుంటోంది. వివిధ మార్కెట్లలో పెట్టుబడులను శోధిస్తున్నారు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఆర్థికవ్యవస్థ వృద్ధికి ఇదొక సానుకూల పరిణామం' అని దాస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, బ్యాంకులు ఈ పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. క్రెడిట్, డిపాజిట్ మధ్య అంతరం పెరిగితే బ్యాంకింగ్ రంగం లిక్విడిటీ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని దాస్ హెచ్చరించారు. ఆర్‌బీఐ తాత్కాలిక డేటా ప్రకారం.. దేశీయంగా బ్యాంకుల రుణాలు జూలై 26 నాటికి గతేడాది కంటే 13.7 శాతం పెరిగాయి. ఇదే సమయంలో డిపాజిట్లు 10.6 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక వృద్ధికి తోడు, పెరుగుతున్న పట్టణ ప్రాంతాల వినియోగం లోన్‌ల డిమాండ్ పెరిగేందుకు కారణమయ్యాయి. కానీ డిపాజిట్లు మాత్రం తగ్గుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు బ్యాంకులు కొత్త ఉత్పత్తులను, సేవల ఆఫర్‌లను ఇవ్వడం ద్వారా డిపాజిట్లు పెంచే మార్గాలను అన్వేషించాలని దాస్ అభిప్రాయపడ్డారు.