- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. జస్ట్ సింగిల్ చార్జింగ్‌తో 100 కిలోమీటర్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంది. పలు కంపెనీలు కూడా ఇటీవల కాలంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఈవీ తయారీ కంపెనీ ‘రాఫ్తార్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Raftaar Galaxy’. ఇది చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని దీని ధరను రూ. 51,900 గా నిర్ణయించారు. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఈవీ స్కూటర్ ఇదే అని చెప్పవచ్చు. ఇది రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రాఫ్తార్ గెలాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 30mh. దీనిలో 250 వాట్ బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చారు. బ్యాటరీ పూర్తి చార్జింగ్ చేయడానికి దాదాపు 4-5 గంటలు పడుతుంది. దీనిలో ట్యూబ్‌లెస్ టైర్లు అందించారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, ఎక్స్‌టర్నల్ చార్జింగ్ పోర్ట్ ,టెలీస్కోపిక్ సస్పెన్షన్, యాంటీ థెఫ్ట్ స్మార్ట్ లాక్ మొదలగు ఫీచర్లను అందించారు.