China FDI: చైనా పెట్టుబడులకు మద్దతు ఇచ్చే ఆలోచన లేదు: పీయూష్ గోయల్

by Harish |
China FDI: చైనా పెట్టుబడులకు మద్దతు ఇచ్చే ఆలోచన లేదు: పీయూష్ గోయల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఆలోచన లేదని, తన వైఖరిని పునరాలోచించడం లేదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం అన్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ రచించిన ఎకనామిక్ సర్వే 2024, ఉద్దేశిస్తూ, గోయల్ మాట్లాడుతూ, నివేదిక ఎల్లప్పుడూ కొత్త ఆలోచనల గురించి మాట్లాడుతుంది, అది వారి స్వంత ఆలోచనను తెలియజేస్తుంది. ఆ ఆర్థిక సర్వే ప్రభుత్వానికి ఏమాత్రం కట్టుబడి లేదు, దేశంలో చైనా పెట్టుబడులకు మద్దతు ఇచ్చే ఆలోచన లేదని ఆయన విలేకరులతో అన్నారు.

నాగేశ్వరన్ సర్వేలో స్థానిక తయారీని పెంచడానికి, ఎగుమతి మార్కెట్‌ను సాధించడానికి చైనా నుండి పెట్టుబడులకు అనుమతులు అవసరమని సిఫార్స్ చేసింది. 'చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ' ద్వారా భారత్‌కు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. అయితే ఈ విషయంపై గోయల్, ఆ దేశం నుంచే వచ్చే పెట్టుబడులకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణ తర్వాత భారతదేశం- చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. సరిహద్దు సమస్యపై పూర్తి పరిష్కారం ఇంకా లభించలేదు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు సాధారణంగా ఉండలేవని భారత్‌ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం TikTok, WeChat , Alibaba UC బ్రౌజర్‌తో సహా 200 పైగా చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేధించింది.

Advertisement

Next Story