PhonePe: ఫోన్‌పే కీలక నిర్ణయం.. కేవలం 9 రూపాయలకే ఇన్సూరెన్స్ పాలసీ..!

by Maddikunta Saikiran |
PhonePe: ఫోన్‌పే కీలక నిర్ణయం.. కేవలం 9 రూపాయలకే ఇన్సూరెన్స్ పాలసీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి(Diwali) ఒకటి. మరికొన్ని రోజుల్లో ఈ పండగ ఉత్సవాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టపాసులు పేల్చి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. టపాకాయలు పేల్చే క్రమంలో పలువురు గాయాలబారిన పడుతుంటారు. బాణాసంచా వల్ల గాయాలుపాలయ్యే వారికి 'ఫోన్‌పే(PhonePe)' కొత్త రకమైన బీమా పాలసీ(Insurance policy)ని తీసుకొచ్చింది. దీపావళి ఫెస్టివల్ ను దృష్టిలో పెట్టుకొని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్(Bajaj Allianz General Insurance) కంపెనీతో కలిసి ఈ కొత్త తరహా బీమా సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. టపాసులు పేల్చే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడితే వారికి ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడనుంది. కేవలం 9 రూపాయలు పెట్టుబడి పెడితే 25 వేల వరకు కవరేజీ లభిస్తుందని ఫోన్‌పే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీని కొనుగోలు చేయాలంటే ఫోన్‌పేలోని ఇన్సూరెన్స్ సెక్షన్(Insurance Section)లోకి వెళ్లి 'ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్(Fire Cracker Insurance)' అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకొని మన వివరాలు అందులో నమోదు చేయాలి. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఈ ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉంటుందని, ఫోన్‌పే వినియోగదారుడుతో పాటు భార్య, పిల్లలు సహా నలుగురు వ్యక్తులు ఈ బీమా కవరేజీ తీసుకోవచ్చని ఫోన్‌పే వెల్లడించింది. అక్టోబర్ 25 తర్వాత ఈ పాలసీ తీసుకున్న వారికి ఆ రోజు నుంచే ఈ బీమా కవరేజీ ప్రాంభమవుతుందని తెలిపింది.

Next Story

Most Viewed