- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 శాతానికి పైగా పెరిగిన ప్యాసింజర్, ద్విచక్ర వాహనాల ఎగుమతులు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్యాసింజర్‌తో పాటు ద్విచక్ర వాహనాల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరిగాయని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తెలిపింది. మంగళవారం సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెలకు సంబంధించి ద్విచక్ర వాహనాలు 24.3 శాతం పెరిగి 3.21 లక్షల యూనిట్లకు, ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 21.1 శాతం వృద్ధితో 49,563 యూనిట్లకు చేరాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం నుంచి వాహన ఎగుమతులు క్రమంగా పుంజుకుంటున్నాయని హీరో మోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా చెప్పారు. తాము ఎగుమతుల వృద్ధికి అనుగుణంగా పలు దేశాల్లో డిస్ట్రిబ్యూటర్లలో మార్పులు చేశామని, ఈ ఏడాది మరింత వేగంగా ఇతర మార్కెట్లకు సరఫరా చేయగలమని ఆయన వివరించారు. దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి సైతం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.83 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్టు కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల హెడ్ రాహుల్ భారతీ చెప్పారు. మరోవైపు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం వృద్ధితో 34.58 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల ఎగుమతులు 1.5 శాతంతో స్వల్పంగా పెరిగి 6.72 లక్షల యూనిట్లకు చేరాయి. ఈ ఏడాదిలో ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయని సియామ్ పేర్కొంది.