- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఓకు రానున్న పార్క్ హోటల్స్!
న్యూఢిల్లీ: 'ది పార్క్' బ్రాండ్ పేరుతో హోటళ్ల వ్యాపారంలో ఉన్న అపీజయ్ సురేంద్ర పార్క్ హోటల్స్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు రానుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 1,050 కోట్ల విలువైన నిధులౌ సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. కంపెనీ దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ఐపీఓ మొత్తంలో రూ. 650 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజా ఇష్యూ ద్వారా, ప్రమోటర్లు, పెట్టుబడిదారుల నుంచి రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా సేకరించనుంది. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సభ్యులు కంపెనీలో 94.18 శాతం వాటాను కలిగి ఉన్నారు. మరో ఇద్దరు పెట్టుబడిదారులు 5.82 శాతం వాటాను కలిగి ఉన్నారు. హోటల్ పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న పార్క్ హోటల్స్ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, మరిన్ని నగరాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది.