- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Post Office: యాప్ ద్వారా పోస్టాఫీసు డిజిటల్ ఖాతాను ఇలా ఓపెన్ చేయండి
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసు వినియోగదారులకు కొత్త కొత్త సదుపాయాలను తీసుకొస్తుంది. ఈ మధ్యకాలంలో కస్టమర్లకు సులభంగా సేవలు అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)ని తీసుకొచ్చింది. దీని ద్వారా పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం యాప్ ద్వారా డిజిటల్‌గా పొదుపు ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా IPPB మొబైల్ యాప్ సహయంతో ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ వివరాలు, నగదును ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా (SSA), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా IPPB డిజిటల్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ముఖ్యంగా ఖాతా తెరిచిన 12 నెలలలోపు e-kyc ని పూర్తి చేయాలి. లేకపోతే ఖాతాను రద్దు చేస్తారు. e-kyc కోసం దగ్గరలోని పోస్టాఫీసు లేదా పోస్ట్‌మెన్‌ను సంప్రదించవచ్చు. 12 నెలలలోపు e-kyc పూర్తి చేస్తే డిజిటల్ పొదుపు ఖాతాను పోస్టాఫీసు పొదుపు ఖాతాకు అనుసంధానిస్తారు.
IPPB ఖాతా వల్ల ఉపయోగాలు..
* జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను ప్రారంభించవచ్చు.
* రూపే వర్చ్యువల్ కార్డును జారీ చేస్తారు.
* బిల్లు చెల్లింపులు, రీచార్జ్‌లు యాప్ ద్వారా చేయవచ్చు.
* బ్యాంకు స్టేట్‌మెంట్ ఉచితంగా లభిస్తాయి.
IPPB ఖాతాను ఇలా ఓపెన్ చేయండి..
* ముందుగా ఫోన్‌లో IPPB యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
* మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కి వెళ్లి, 'ఓపెన్ అకౌంట్'పై క్లిక్ చేయాలి.
* పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
* అడ్రస్, నామీని ఇతర వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఖాతా ఓపెన్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న పోస్టాఫీసు SCSS స్కీం