సెంచరీ కొట్టిన ఉల్లి

by Nagaya |
సెంచరీ కొట్టిన ఉల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటి వరకు టమాట ధరలు ఆకాశనంటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే బాటలో ఉల్లి ధరలు పయణిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఉల్లి ధరలు అమాంతం పెరిగి సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈ యేడు కూడా అదే మాదిరిగా ధరలు ఘాటెక్కాయి. తెలంగాణలో రూ.50 నుంచి 60 రూపాయల మధ్య ఉల్లి ధరలు కొనసాగుతున్నా.. ఏపీలో మాత్రం వీటి ధర కేజీ వంద రూపాయలకు చేరింది. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతియేటా వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తారు. అయితే గతేడాది సరైన ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనేవారే దిక్కులేక కొందరు రైతులు రోడ్లపై పారబోశారు. ఈ నేపథ్యంలో రైతులు ఈ యేడు ఉల్లిసాగును గణనీయంగా తగ్గించారు. దీంతో ధరలు పెరిగాయి.

గతేడాది కేవలం అనంతపురం జిల్లాలోనే 2700 ఎకరాల్లో ఉల్లిసాగు చేసిన రైతులు ఈసారి 300 ఎకరాలకే పరిమితం అయ్యారు. దీంతో మార్కెట్లో ఉల్లి కొరత ఏర్పడింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో క్వింటా రూ.5000 నుంచి రూ.6000 వరకు పలుకుతుంది. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ఉల్లి ధరలను అమాంతం పెంచి కేజీ రూ.100 చొప్పుల విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉల్లిపాయలను కొనలేని స్థితిలో ధరలు ఉండటంతో ప్రజలు అల్లాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed