జొమాటో, స్విగ్గీలకు పోటీ ఇస్తున్న ప్రభుత్వ 'ONDC'!

by Harish |
జొమాటో, స్విగ్గీలకు పోటీ ఇస్తున్న ప్రభుత్వ ONDC!
X

న్యూఢిల్లీ: దేశీయ ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న జొమాటో, స్విగ్గీలకు పోటీగా ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ దూసుకెళ్తోంది. తక్కువ ధరలను ఆఫర్ చేస్తూ ప్రభుత్వం ఈ-కామర్స్ సైట్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ) ఫుడ్ డెలివరీ సంస్థలకు సవాలుగా నిలుస్తోంది. చిన్న సంస్థలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఓఎన్‌డీసీ సరైన ఫలితాలనిస్తోందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతానికి హైదరాబాద్ సహా 240 నగరాల్లో సేవలందిస్తున్న ఓఎన్‌డీసీ ఫుడ్, నిత్యావసర సరుకుల విభాగాల్లో రోజుకు 10 వేల డెలివరీలను అందిస్తోంది. గతేడాది డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియా లక్ష్యంతో ప్రభుత్వం ఓఎన్‌డీసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ-కామర్స్ రంగంలో ఇతర కంపెనీల ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓఎన్‌డీసీని తీసుకొచ్చింది. థర్డ్‌పార్టీ యాప్స్‌తో సంబంధం లేకుండా ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎవరైనా ఉత్పత్తులను విక్రయించవచ్చు. వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు.

ఈ క్రమంలోనే వినియోగదారులు జొమాటో, స్విగ్గీలు, ఓఎన్‌డీసీలో లభించే ఆహార పదార్థాల మధ్య ధరల బేధాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఓఎన్‌డీసీ పెద్ద టెక్-ఆధారిత ఈ-కామర్స్ కంపెనీలతో పోటీ పడేందుకు చిన్న రిటైల్‌ సంస్థలకు సహాయం చేస్తుంది. ఇది చెల్లింపుల వ్యవస్థలో తీసుకొచ్చిన యూపీఐ తరహాలో ఇ-కామర్స్ రంగంలోనూ పెను మార్పులకు కారణమవుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ ఇదివరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed