Ola Electric Scooters: కస్టమర్లకు ఓలా బంపర్ ఆఫర్.. కేవలం రూ.49,999లకే 'ఎస్ 1' ఎలక్ట్రిక్ స్కూటర్..ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-11 09:17:28.0  )
Ola Electric Scooters: కస్టమర్లకు ఓలా బంపర్ ఆఫర్.. కేవలం రూ.49,999లకే ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్..ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశవ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్(Festival season) నడుస్తోంది. పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఎదో ఒక కొత్త వస్తువు కొనాలని అనుకుంటారు. ఈ మేరకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్స్ కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విద్యుత్ స్కూటర్ల(Electric scooters) సంస్థ ఓలా(Ola) ‘బాస్ 72-గంటల రష్(Boss 72-hour rush)’ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 10 నుండి 12 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సేల్ లో భాగంగా ఓలా ఎస్ 1 ఎక్స్, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల(S1X, S1 Pro Electric Scooters)పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో వినియోగదారులు ఓలా ఎస్ 1 ఎక్స్ '2 కిలోవాట్ వేరియంట్(2Kwh Variant)'ను రూ .49,999 (Ex-Showroom)లకే కొనుగోలు చేయవచ్చుని తెలిపింది.ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది.

అలాగే, ఓలా ఎస్ 1 ప్రో(Ola S1 Pro)పై రూ .25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత వెహికల్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఫ్లాట్ రూ .5,000 బోనస్ కూడా లభిస్తుంది. బాస్ 72-అవర్ రష్‌లో భాగంగా ఓలా స్కూటర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.7,000 విలువ చేసే 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వరకు బ్యాటరీ వారంటీని ఉచితంగా ఇస్తోంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్‌తో స్కూటర్ కొన్న వారికి రూ.5,000 వరకు ఫైనాన్స్ ఆఫర్ లభిస్తుంది. అలానే రూ.6,000. విలువైన మూవ్ఓఎస్+(MoveOS+) అనే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక ఈ మూడు రోజుల ఆఫర్ పీరియడ్‌లో ఓలా స్కూటర్లు కొన్నవారికి రూ.7,000 వరకు ఫ్రీ చార్జింగ్ క్రెడిట్లను కూడా ఓలా అందించనుంది.

Advertisement

Next Story