- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPOకు అనుమతి పొందిన ఓలా ఎలక్ట్రిక్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ నిధులు పొందేందుకు మార్గం సుగమం అయింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్, ఐపీఓను(ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ప్రారంభించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. కంపెనీ దాదాపు రూ.7,250 కోట్లు (సుమారు $850 మిలియన్లు) సమీకరించడానికి సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మొత్తంలో రూ. 5,500 కోట్ల తాజా ఇష్యూ ద్వారా, రూ. 1,750 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా లభించనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ తన దరఖాస్తులో పేర్కొన్న దాని ప్రకారం, ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను రుణాన్ని తిరిగి చెల్లించడానికి, పరిశోధన, అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది. సంస్థ క్యాపెక్స్ కోసం దాదాపు రూ. 1,226 కోట్లు, రుణాన్ని తిరిగి చెల్లించడానికి రూ. 800 కోట్లు, అత్యధికంగా రూ. 1,600 కోట్లను పరిశోధన, అభివృద్ధికి, రూ. 350 కోట్లు ఇతర వృద్ధికి ఖర్చు చేయనుంది. గత ఏడాది డిసెంబర్‌లోనే కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు ఆమోదం లభించింది.
Ola ఎలక్ట్రిక్ ప్రస్తుతం ఈవీ టూ-వీలర్ మార్కెట్లో దాదాపు 52 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రభుత్వ వాహన్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, కంపెనీ ఈ నెలలో 34,000 యూనిట్లను నమోదు చేసింది, ఇది సంవత్సరానికి 54 శాతం వృద్ధిని సూచిస్తుంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ మొత్తం రూ. 1,272 కోట్ల ఆదాయాన్ని, రూ. 267 కోట్ల నష్టాలను నివేదించింది.