- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్-EFTA డీల్ అమలుకు ఏడాది పట్టవచ్చు!
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారత్-యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA)తో వాణిజ్య ఒప్పందానికి సంతకాలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే దీని అమలుకు దాదాపు ఒక సంవత్సరం పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అన్నారు. మార్చి 10న భారత్-ఐస్‌ల్యాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్‌ల కూటమితో కూడిన EFTAతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఆయా దేశాలు రాబోయే 15 సంవత్సరాలలో $100 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నాయి. అలాగే ఆ దేశాలకు చెందిన వివిధ ఉత్పత్తులు భారత్‌లోకి ప్రవేశించడానికి ఎలాంటి సుంకం ఉండదు.
అయితే ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA)కు ఆమోద ప్రక్రియ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావాలంటే దాదాపు ఏడాది సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. స్విట్జర్లాండ్‌తో ఈ డీల్ ఒకే కావడానికి అక్కడి పార్టమెంట్‌లో చర్చించి, ఆ తరువాత ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే మిగతా సభ్య దేశాల్లో కూడా ఆమోదానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి భారత్-EFTA ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఏడాది పట్టవచ్చని అధికారులు అన్నారు.