- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడు నగరాల్లో రెండు రెట్లు పెరిగిన ఆఫీస్ లీజింగ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతేడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది జులైలో ఈ నగరాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ 39 లక్షల చదరపు అడుగులు ఉండగా, గత నెల ఇది 88 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. అంతకుముందు జూన్‌లో ఇది 58 లక్షల చదరపు అడుగులుగా ఉంది.
అన్ని నగరాల్లో అన్ని రకాల ఆఫీస్ స్థలాలకు డిమాండ్, లావాదేవీలు పెరిగాయని, ఇందులో కొత్త వాటితో పాటు రెన్యూవల్స్ కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. సమీక్షించిన నెలలో 85 శాతం వాటాతో బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్, పూణే, కోల్‌కతా నగరాలున్నాయి.
మొత్తం లీజింగ్‌లో 53 శాతంతో టెక్ కంపెనీలు అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు 18 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు నెమ్మదించడం, దేశవ్యాప్తంగా ఆఫీసులు తిరిగి కార్యకలాపాలు సాధారణ స్థాయిలకు చేరుకుంటున్న తరుణంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది.