కొత్త మొబైల్ యాప్‌ని లాంచ్ చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్‌..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-02 11:46:32.0  )
కొత్త మొబైల్ యాప్‌ని లాంచ్ చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీ(Stock Exchange)లలో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) కొత్తగా మొబైల్ యాప్(Mobile App)ను లాంచ్ చేసింది. దీపావళి పండగ(Diwali Festival)సందర్భంగా తెలుగుతో పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లోకి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. వెబ్‌సైట్‌(Website)ను సైతం మరింత విస్తరిస్తున్నట్లు ఎన్ఎస్ఈ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కాగా ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌లో(www.nseindia.com) ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ మరియు గుజరాతీ ఇప్పటికే అందుబాటులో ఉండగా తాజాగా అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు భాషలకు దీన్ని విస్తరించింది. దీంతో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లో డేటాను యాక్సెస్ చేసే అవకాశం లభించింది. కాగా ఎన్ఎస్ఈ ఇండియా మొబైల్ యాప్(NSEIndia) ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్(Apple App Store), ఆండ్రాయిడ్ ప్లే స్టోర్(Android Play Store) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా మార్కెట్ కు సంబంధించిన ఇండికేషన్స్‌, మార్కెట్‌ అప్ డేట్లు, మార్కెట్ ట్రెండ్స్‌, నిఫ్టీలో టాప్‌ గెయినర్స్‌, లూజర్స్‌ వంటి తదితర సమాచారం తెలుసుకోవచ్చు.

Next Story

Most Viewed