భారీగా పెరిగిన పెన్షన్ పథకాల్లో చేరే వారి సంఖ్య!

by Harish |
భారీగా పెరిగిన పెన్షన్ పథకాల్లో చేరే వారి సంఖ్య!
X

న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో చేరే సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 4 నాటికి ఈ పథకాల్లో చేరిక 23 శాతం పెరిగి 6.24 కోట్లకు చేరుకుంది. అటల్ పెన్షన్ యోజన పథకంలో మాత్రమే 28 శాతం వృద్ధితో కోటికి మందికి పైగా కొత్తగా చేరారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ రెండు పథకాల నిర్వహణలో ఉన్న మొత్తం పెన్షన్ ఆస్తులు(ఏయూఎం) 2023, మార్చి 4 నాటికి 23.45 శాతం పెరిగి రూ. 8.82 లక్షల కోట్లకు చేరుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చందాదారుల సంఖ్య 2022, మార్చి 5 నాటికి 5.08 కోట్ల మంది ఉండగా, ఈ ఏడాది మార్చి 4 నాటికి 22.88 శాతం పెరిగి 6.24 కోట్లకు పెరిగింది.

మొత్తం ఎన్‌పీఎస్‌లో ఉన్న వారిలో 23.86 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. కార్పొరేట్ చందాదారులు 16.63 లక్షల మంది ఉన్నారు. మార్చి 4 నాటికి ఏపీవై చందాదారుల సంఖ్య 28.4 శాతం పెరిగి 4.53 కోట్లకు చేరుకుంది. కాగా, గతేడాది అక్టోబర్ 1 నుంచి ఆదాయ పన్ను చెల్లించేవారు ఏపీవైని ఎంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed