- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPI పేమెంట్ ఫీచర్‌తో నోకియా కొత్త ఫోన్.. ధర రూ.999
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం UPI పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఫీచర్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్లు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోన్లతో పాటే సాధారణ ఫోన్లలో కూడా UPI ఫీచర్‌ను ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల జియో తన ఫోన్‌లో ఈ సదుపాయాన్ని అందించగా, ఇప్పుడు అదే జాబితాలో మరో దిగ్గజ కంపెనీ నోకియా కూడా చేరింది. నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్‌ను కంపెనీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ 2G సపోర్ట్‌తో వచ్చింది. దీనిలో ఇన్‌బిల్ట్‌గా UPI అప్లికేషన్‌ను అందించారు. దీంతో నేరుగా పేమెంట్స్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 999. ఇది చార్‌కోల్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ ఆప్షన్లు ఉన్నాయి.
నోకియా 105 క్లాసిక్ 1.8-అంగుళాల(4.57 cm) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ S30+ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 800mAh బ్యాటరీని అమర్చారు. ఇది స్టాండ్‌బై మోడ్‌లో 22 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అదే టాక్ టైమ్ పరంగా 12 గంటలు వస్తుంది. FM రేడియోను కూడా దీనిలో అందించారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్‌తో వచ్చింది. 2000 కాంటాక్ట్‌లను సేవింగ్‌తో పాటు, 500 మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చు.
- Tags
- Nokia
- upi payment