ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు వేతన పెంపు లేదు!

by Harish |
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు వేతన పెంపు లేదు!
X

న్యూఢిల్లీ: ఉద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిరాశకు గురిచేసింది. ఈ ఏడాదికి పూర్తిస్థాయి శాశ్వత ఉద్యోగులకు వేతన పెంపు ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు లేఖ రాసినట్లు సమాచారం. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో తెలిపారు.

కొన్ని నెలల పాటు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాము. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో తీసుకున్నదే అన్నారు. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేని కారణంగా గత ఏడాది మాదిరిగా పరిహారం కోసం ఎక్కువ మొత్తాలను కేటాయించడం వీలవదని సత్య నాదెళ్ల చెప్పారు. అయితే, ఉద్యోగులకు ఇప్పటికీ ప్రమోషన్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

జీతాల పెంపును ప్రస్తుతానికి నిలిపేయడమే కాకుండా ఉద్యోగులకిచ్చే బోనస్‌లు, స్టాక్ రివార్డుల కోసం తక్కువ నిధులను కేటాయించనున్నారు. ఇదే సమయంలో కొన్ని గంటల పాటు చేసే ఉద్యోగులు, దానికి సమానమైన వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ ఏడాది పూర్తిస్థాయి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పెంపు ఉండదని వివరించారు. కంపెనీ తీసుకున్న అనూహ్య నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed