- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ ఉన్నా దేశవ్యాప్త ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ తగ్గలేదు: అనరాక్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మెరుగ్గా నమోదవుతాయని, కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ప్రభావం దీనిపై పెద్దగా ప్రభావం ఉండదని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. అనేక రాష్ట్రాలు ఒమిక్రాన్‌ను నియంత్రించేందుకు వారాంతంలో కర్ఫ్యూ, ఇతర నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు మొదటి రెండు వారాలు మాత్రమే కొంత ప్రతికూలంగా ఉండేదని, ఆ తర్వాత అమ్మకాలు, ఇళ్ల గురించి ఎంక్వైరీలు వేగంగా పెరుగుతున్నాయని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి చెప్పారు. గతంలో మాదిరి పూర్తిగా లాక్‌డౌ లేకపోవడ, కొత్త వేరియంట్ వల్ల మరణాల రేటు, ఆసుపత్రుల్లో చేరే వారు తక్కువగా ఉండటంతో ఈ రంగంలో అమ్మకాల సెంటిమెంట్ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
2021లో భారత నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు స్థాయిలో పుంజుకుంది. వడ్డీ రేట్లు, కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తక్కువ కావడం, పరిశ్రమలో పటిష్టమైన ఆర్థిక పునరుద్ధరణ, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం పెద్ద ఇళ్లను కొనేవారు పెరిగారని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇండియా ఎండీ(రెసిడెన్షియల్) షాలిన్ రైనా అన్నారు. ఈ ఏడాది మరింత వృద్ధి ఉంటుందని ఆయన అంచనా వేశారు. అనరాక్ గణాంకాల ప్రకారం దేశంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా మొత్తం ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 71 శాతం పెరిగి 2,36,530 యూనిట్లకు చేరుకున్నాయి. వార్షిక పరంగా పెరిగినప్పటికీ కరోనాకు ముందు స్థాయి కంటే 10 శాతం ఎక్కువగా ఉందని అనరాక్ వెల్లడించింది.