భారత్‌కు తప్ప మరే దేశానికీ ఇంత మంచి భవిష్యత్తు అవకాశాలు లేవు

by S Gopi |   ( Updated:2024-02-26 14:34:04.0  )
భారత్‌కు తప్ప మరే దేశానికీ ఇంత మంచి భవిష్యత్తు అవకాశాలు లేవు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తులో వృద్ధి సాధించే అవకాశాలు భారత్‌కు మించి ప్రపంచంలో మరే దేశానికీ లేదని దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్ సీ భార్గవ అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దేశం ముందుకెళ్లడానికి మొత్తం చట్టాలు, నిబంధనలే కాకుండా, కొన్ని విధానాల వంటి పాత సామాను వదిలించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని పాశ్చాత్య దేశాలు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నాయని, అవి వృద్ధి చెందడం ఇక పాత విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఆయా దేశాలు వృద్ధి చెందినా, మాంద్యంలోకి వెళ్లినా ప్రజలకు అవసరంలేదు. ప్రజలు ఇప్పుడు మరింత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. పనిచేయకుండా అన్నీ రావాలని అక్కడి వారు ఆశిస్తున్నారు. మరోవైపు, భారత్‌లో ప్రజలు తమ భవిష్యత్తును మాత్రమే కాకుండా వారి కుటుంబం, పిల్లల భవిష్యత్తు మెరుగుపరిచేందుకు కాంక్షిస్తున్నారని' భార్గవ వివరించారు. అదే భారత్‌ను ముందుకు నడిపిస్తోంది. ఈ ధోరణి చాలా తక్కువ దేశాలకే సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ప్రజలు తమ పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని గుర్తించారు. తాము సైతం ఏడాదికి లక్ష కార్ల నుంచి 22 లక్షల కార్ల అమ్మకాలకు ఎదిగాం. ఇది తమ అసలు సామర్థ్యం కంటే 21 రెట్లు ఎక్కువ. ఇదంతా స్థానికంగా లభించిన వనరులతోనే సాధ్యమైందని భార్గవ వెళ్లడించారు.

Advertisement

Next Story