- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Budget 2024: చరిత్ర లిఖించనున్న నిర్మలా సీతారామన్.. మొరార్జీ దేశాయ్ తర్వాత అరుదైన ఘనత..
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పబోతున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను సీతారామన్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు గతంలో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ పేరిట ఉండగా, ఇప్పుడు 2024లో సీతారామన్ దీనిని అధిగమించబోతున్నారు. ఆర్థికమంత్రి సీతారామన్ ఇప్పటి వరకు ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించగా, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు, ప్రస్తుతం పూర్తిస్థాయి ఆరో బడ్జెట్, మొత్తంగా చూసినట్లయితే ఏడో బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు.
1959 నుండి 1964 వరకు, 1967 నుంచి 1969 మధ్యకాలంలో మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరు మీదే ఉంది. ఇప్పటి వరకు దీనిని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. 1959- 64 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన దేశాయ్ రికార్డు స్థాయిలో వరుసగా ఆరు బడ్జెట్‌లను సమర్పించారు, వాటిలో ఐదు పూర్తి బడ్జెట్‌లు. ఒకటి మధ్యంతర బడ్జెట్.
ఇక సీతారామన్ విషయానికి వస్తే, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఆమె ఘనత సాధించారు. అయితే ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టగా, తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించి సరికొత్త చరిత్రను లిఖించారు.
ఆమె ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టడంలోను కొత్త మార్పులు తీసుకొచ్చారు. పేపర్‌లెస్ రూపంలో డిజిటల్ మోడ్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధానాన్ని పాటించనున్నారు. ఇప్పటికే బడ్జెట్ తయారీకి సంబంధించిన ప్రక్రియ ముగిసింది. దీనికి ముందు కార్మిక సంఘాలు, విద్య, ఆరోగ్య రంగాలు, ఉపాధి, నైపుణ్యం, MSMEలు, వాణిజ్యం, సేవలు, పరిశ్రమలు, ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్‌ల ప్రతినిధులతో సమావేశం అయి వారితో చర్చలు జరిపి, దేశ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే అంశాలతో బడ్జెట్‌ను రూపొందించారు.