- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై ఫాస్టాగ్ చెల్లింపులకు పేటీఎం పనిచేయదు.. ఎందుకంటే?
దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో ఉన్న కంపెనీకి తాజాగా ఎన్‌హెచ్ఏఐ షాక్ ఇచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఫాస్టాగ్ సేవల కోసం అనుమతిచ్చిన 30 ఆథరైజ్‌డ్ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీపై నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది. ఫాస్టాగ్ యూజర్లు టోల్ రుసుమును చెల్లించేందుకు, ఇబ్బందులు పడకుండా ప్రయాణించేందుకు తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలని ఎన్‌హెచ్ఏఐ తరపున టోల్ ఫీజు వసూలు చేస్తున్న ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్ఎంసీఎల్) వెల్లడించింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. ఇందులోంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఇటీవల ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్, ఫాస్టాగ్ లాంటి వాటిలో డిపాజిట్, టాప్-అప్ తీసుకోవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. సంబంధిత అకౌంట్లలో ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని ఖాళీ అయ్యే వరకు వినియోగించవచ్చని పేర్కొంది.