- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్లే: RBI Governor శక్తికాంత దాస్!
ముంబై: తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. తాను ఇప్పటికీ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టు బుధవారం ఓ కార్యక్రమంలో తెలిపారు. క్రిప్టోకరెన్సీలకు అంతర్లీనంగా విలువ లేదని, ఇవి స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు స్థిరత్వానికి ముప్పు అని ఆర్‌బీఐ చాలా కాలంగా అభిప్రాయపడుతోంది. వాటి వినియోగాన్ని చట్టబద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తుంది.
దీన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ ఇటీవల స్వంత క్రిప్టోకరెన్సీని ప్రారంభించిందన్నారు. ఆర్‌బీఐ తన సొంత డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ), ఈ-రూపీని గత నెల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ సైతం ఐఎంఎఫ్ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ, ప్రస్తుతం క్రిప్టోకరెన్సీల గురించి అందుబాటులో ఉన్న డేటా తప్పుదారి పట్టించేదిగా ఉందన్నారు. డిజిటల్ కరెన్సీలు ఏంటి, అవేం చేయాలో స్పష్టత అవసరమని, వాటికి సంబంధిత నిబంధనలు రూపొందించాలన్నారు.