మార్కెట్లోకి విడుదలైన సరికొత్త Bajaj Pulsar P150

by Harish |   ( Updated:2022-11-23 13:54:00.0  )
మార్కెట్లోకి విడుదలైన సరికొత్త  Bajaj Pulsar P150
X

దిశ, వెబ్‌డెస్క్: బజాజ్ కంపెనీ పల్సర్ వేరియంట్‌లో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. దీని పేరు 'పల్సర్ పీ 150'. ప్రారంభ ధర రూ. 1,16,755(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). బైక్ ప్రత్యేకమైన ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. 149.68cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. ఇంజన్ 85000 rpm వద్ద 14.5 ps శక్తిని, 6000 rpm వద్ద 13.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు. సస్పెన్షన్ పరంగా 31mm టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ అబ్జర్లను అమర్చారు.


బైక్ ముందు భాగంలో బైం-ఫంక్షనల్ LED లైట్లు కలిగి ఉంది. ఇవి చీకట్లో మంచి వెలుతురును అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అదనంగా దీనికి USB మొబైల్ చార్జింగ్ పోర్ట్‌ను అందించారు. ఇది 5 కలర్స్‌లలో లభిస్తుంది. బైక్ సింగిల్ ఛానల్ ABS ద్వారా రెండు వేరియంట్లు(సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ బ్రేకులు) అందుబాటులో ఉన్నాయి. సింగిల్ డిస్క్ ధర రూ.1,16,755, డబుల్ డిస్క్ ధర రూ. 1,19,757.

Advertisement

Next Story