- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
దిశ, బిజినెస్ బ్యూరో: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రజల ఆర్థిక లావాదేవీల విషయాల్లో చాలా మార్పులు రానున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు మాత్రం కొన్ని కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది. SBI కార్డ్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కొత్త నిబంధనల విషయంలో అలర్ట్‌గా ఉండాలి. రివార్డ్స్, క్యాష్‌బ్యాక్‌లు వంటి వాటిలో మార్పులు వచ్చాయి. అయితే ఈ బ్యాంక్‌లు తమ క్రెడిట్ కార్డు విషయంలో ఏ ఏ నిబంధనలు తీసుకొచ్చాయో ఒకసారి చూద్దాం.
SBI: ఇప్పటివరకు క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్ల ఇస్తున్న బ్యాంక్ ఏప్రిల్ 1, 2024 నుండి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేసినట్లయితే ఎలాంటి రివార్డ్ పాయింట్ల రావు. క్రెడిట్ కార్డ్‌లలో AURUM, SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, SBI కార్డ్ పల్స్, సింప్లీక్లిక్ SBI కార్డ్ వంటి వాటిపై ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభావం ఉండనుంది.
ICICI బ్యాంక్: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో అప్‌డేట్‌లు చేసింది. తదుపరి రాబోయే త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డు ద్వారా రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. రివార్డ్ పాయింట్ ఆదాయాలు, లాంజ్ యాక్సెస్, వార్షిక రుసుము మినహాయింపు నియమాల్లో మార్పులు చేశారు.
యాక్సిస్ బ్యాంక్: ఇతర బ్యాంకుల మాదిరిగా ఈ బ్యాంక్ కూడా కీలక మార్పులు చేసింది. ఇంధనం, బీమా, బంగారం/ఆభరణాలకు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినట్లయితే ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వమని బ్యాంక్ పేర్కొంది. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం పొందాలంటే మూడు నెలల్లో రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే, దేశీయ, అంతర్జాతీయ లాంజ్ ప్రోగ్రామ్‌లకు వర్తించే కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్యను 8 నుంచి 4 కి తగ్గించింది.