National Geographic : నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్‌‌కు గుడ్‌బై!

by Harish |   ( Updated:2023-06-29 15:19:03.0  )
National Geographic : నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్‌‌కు గుడ్‌బై!
X

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా అనేక సంస్థలు ఉద్యోగులను తొలగింపులు చేపడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఇంటికి సాగనంపాయి. తాజాగా 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మ్యాగజైన్ సంస్థ నేషనల్ జియోగ్రఫిక్ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించింది. సంస్థలో మిగిలిన చివరి 19 మంది స్టాఫ్ రైటర్లను తీసేసినట్టు వెల్లడించింది.

దాంతో 2024 నుంచి నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ న్యూస్ స్టాండ్స్‌లో కనిపించిందని అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. ఆడియో విభాగంలో సైతం కొందరిని తొలగించినట్టు తెలుస్తోంది. 1888లో నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ మొదటి సంచికను ప్రచురించింది. శతాబ్దానికి పైగా సంస్థ ప్రపంచం, ప్రకృతి, సైన్స్ వంటి అనేక అంశాల గురించి కథనాలను తీసుకొచ్చింది.

గత కొంతకాలంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సంస్థ ఎడిటోరియల్ పరంగా అనేక మార్పులు చేస్తూ వచ్చింది. ప్రస్తుతానికి మ్యాగజైన్‌ను డిస్నీ సంస్థ నిర్వహిస్తుండగా, అమ్మకాలు పడిపోవడం, ఇతర కారణాలతో ఖర్చులను తగ్గించే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తాజా తొలగింపుల నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed