త్వరలో జాతీయ ఈ-కామర్స్ పాలసీ ప్రారంభం

by srinivas |
త్వరలో జాతీయ ఈ-కామర్స్ పాలసీ ప్రారంభం
X

న్యూఢిల్లీ: జాతీయ ఈ-కామర్స్ పాలసీ తుది దశలో ఉందని, త్వరలో దీన్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆగస్టులో ఈ పాలసీకి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులు, దేశీయ వ్యాపారుల సంఘంతో చర్చలు నిర్వహించింది. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో చివరి దశకు చేరుకుంది.త్వరలో ప్రారంభిస్తామని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ పని చేస్తోంది.

Advertisement

Next Story