- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించేలా బోర్డు నిర్ణయించింది. సంస్థ బోర్డు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం ద్వారా వచ్చిన రతన్ టాటా.. చంద్రశేఖరన్ సారథ్యంలో టాటా గ్రూప్ పురోగతి, పనితీరుపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు సిఫార్సు చేశారు. బోర్డు సభ్యులు సైతం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పనితీరుపై సానుకూలంగా స్పందించారు. ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ పదవీ కాలం ఈ నెల 20 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు తాజాగా సంస్థ వెల్లడించింది. టాటా-మిస్త్రీ కుటుంబానికి చెందిన వారు కాకుండా ఇంకొక వ్యక్తి టాటా గ్రూపునకు ఛైర్మన్‌గా ఉండటం చంద్రశేఖరన్‌తోనే మొదలైంది. బోర్డు మెంబర్ల మద్దతు నేపథ్యంలో రెండోసారి బాధ్యతలను దక్కించుకున్నారు. గత ఐదేళ్లలో చంద్రశేఖరన్ పదవీకాలంలో స్టీల్, ఏవియేషన్, డిజిటల్ రంగాలలో టాటా గ్రూప్ అనేక విలీనాలతో పాటు కొనుగోళ్ల ద్వారా మెరుగైన వృద్ధిని సాధించింది.