- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Mukesh Ambani: ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్.. మరో వ్యాపారంలోకి ఎంట్రీ..!
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్(RIL Chairman) ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. టెలికాం, రిటైల్, ఫ్యాషన్ లాంటి రంగాల్లో ఇదివరకే తనకు వ్యాపారాలు ఉండాగా.. తాజాగా మరో కీలక రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. స్నాక్స్ రంగం(Snacks sector)లో కూడా తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే రూ.42,000 కోట్లకు పైగా వాల్యూ ఉన్న స్నాక్ మార్కెట్(Snack Market)ను ఆయన టార్గెట్ చేశారని తెలుస్తోంది. స్నాక్స్ వ్యాపారంలో ఎంట్రీకి తన కూల్ డ్రింక్(Cool Drink) బ్రాండ్ క్యాంపా(Campa) తరహాలో వ్యూహాలు అమలు చేస్తున్నారట. కాగా అంబానీ క్యాంపా సాఫ్ట్ డ్రింక్స్ అమ్మకాల కోసం డిస్ట్రిబ్యూటర్లకు కోకాకోలా(CoCola), పెప్సికో(Pepsico) లాంటి బ్రాండ్ల మార్జిన్ల కంటే భారీగా ఇచ్చారు. ఇలా స్నాక్స్ లో కంపెనీలు సూపర్ స్టాకిస్టులకు 3-5 శాతం లాభాలను, డిస్ట్రిబ్యూటర్లకు 6-15 శాతం మార్జిన్లు ప్లస్ 20 శాతం ఆఫర్లను ముఖేష్ అంబానీ ఇవ్వనున్నారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కంపెనీ నుంచి త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.