LIC Best Scheme: ఈ ఒక్క స్కీమ్‌తో ఎన్నో బెనిఫిట్స్‌.. ప్రతినెలా అకౌంట్‌లోకి డబ్బులు.. ఎంత వస్తుందంటే?

by Vennela |
LIC Best Scheme: ఈ ఒక్క స్కీమ్‌తో ఎన్నో బెనిఫిట్స్‌.. ప్రతినెలా అకౌంట్‌లోకి డబ్బులు.. ఎంత వస్తుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్:LIC Best Scheme: ఎల్ఐసీ జీవన్ అక్షయ్ పథకం(LIC Jeevan Akshay Scheme)తో 30 నుంచి85ఏళ్ల వయసు వారికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కనీస పెట్టుబడితో ప్రారంభించి రిటైర్ అయ్యాక ప్రతినెలా రూ. 12వేలు పొందవచ్చు. ఇందులో పన్ను మినహాయింపులు(Tax exemptions) కూడా ఉంటాయి.ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో సేవింగ్స్(Savings) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ గ్రామాల్లోకి కూడా వెళ్లిపోయేసరికి ప్రజలకు పొదుపు, పెట్టుబడుల ప్రాముఖ్యత అనేది అర్థం అయ్యింది. భవిష్యత్తు అవసరాలు తీర్చుకునేందుకు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఇవి ఎంతో అవసరం. బ్యాంకులు(banks), పోస్టాఫీసులు(postoffices), ఎల్ఐసీ(lic) వంటి సంస్థలు ప్రజల కోసం పలు పొదుపు పథకాలను అందిస్తున్నాయి. భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ(lic) అన్ని వయస్సుల వారికి అనువైన పలు రకాల పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ(lic) అందించే ప్రజాదరణ పొందిన స్కీముల్లో జీవన్ అక్షయ్ ఒకటి.

ఈ స్కీములో కనీసం 20వేల రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. వీటిలో నెలలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రీమియం చెల్లింపు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్కీము స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు దోహదం చేస్తుంది. జీవన్ అక్షయ్ స్కీము(LIC Jeevan Akshay Scheme) కింద చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులకు అర్హులు. 25 నుంచి 65ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ స్కీములో చేరవచ్చు. జీవన్ అక్షయ్ స్కీము(LIC Jeevan Akshay Scheme)ను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో పొందవచ్చు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం 30 నుంచి 85ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు ఈ స్కీమును పరిగణించాలి.

ఎంతోమంది ఇన్వెస్టర్లు ఎల్ఐసీ అక్షయ్ పాలసీ(LIC Jeevan Akshay Scheme)ని దాని నెలలవారీ ఆదాయం కోసం ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ పాలసీ మంచి రాబడిని ఇస్తుంది. స్థిరమైన పెన్షన్ పొందేందుకు ఎల్ఐసీ అక్షయ్ పాలసీ మంచి అవకాశం. ఈ స్కీములో కనీసం 1లక్ష రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుబడి పెట్టవచ్చు. నెలలవారీ త్రైమాసిక, అర్థ సంవత్సరం లేదా వార్షికంగా వడ్డీ చెల్లింపులను పొందవచ్చు.

ఎల్ఐసీ అక్షయ్ పాలసీ(LIC Jeevan Akshay Scheme)లో రూ. లక్ష పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా రూ. 12వేల పెన్షన్ పొందవచ్చు. అలాగే సింగిల్ ప్రీమియంలో రూ. 40, 72, 000 పెట్టుబడి పెడితే..నెలలవారీ పెన్షన్ రూ. 20వేలు ఉంటుంది. వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా అకౌంట్ తీసుకోవచ్చు. ఈ పాలసీ పన్ను ప్రయోజనాలు అందిస్తుంది. ఈ స్కీములో చేరాలంటే కనీసం వయస్సు 30ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 85ఏళ్లు ఉండాలి. మరిన్ని వివరాల కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. లేదా ఎల్ఐసీ ఏంజెట్ ను సంప్రదించండి.


Next Story

Most Viewed