- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Microsoft సంచలన నిర్ణయం.. భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులను ప్రకటించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఈ మేరకు బుధవారం నుంచి మైక్రోసాఫ్ట్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి 11వేల మంది ఉద్యోగుల తొలగింపు పక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇక, ఇప్పటికే ఫేస్‌బుక్ (మెటా), అమెజన్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు కూడా లేఆఫ్ ప్రకటించగా.. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. అంతేగాక మైక్రోసాఫ్ట్ గతేడాది రెండుసార్లు ఉద్యోగులను తొలగించిందని, వివిధ విభాగాలలో వెయ్యి మందిలోపు ఉద్యోగులను తొలగించినట్లు కూడా వెల్లడించింది.
అయితే మార్కెట్‌లో డిమాండ్ మందగించడం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఉద్యోగాల్లో కోతలను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఉద్యోగుల ఫైలింగ్‌ల ప్రకారం.. జూన్ 30 నాటికి కంపెనీ యునైటెడ్ స్టేట్స్‌లో 1,22,000 మంది ఉండగా, అంతర్జాతీయంగా 99,000 మంది సహా మొత్తం 2,21,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. ఇక, అమెజాన్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే 18 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దం అవ్వగా.. ట్విట్టర్ దాదాపు 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తొలగించింది.
Also Read....
80సీ పన్ను మినహాయింపు రెట్టింపు చేయాలని కోరుతున్న పన్ను చెల్లింపుదారులు!
- Tags
- Microsoft