- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క చార్జ్‌తో 230 కి.మీలు.. మార్కెట్లోకి సరికొత్త కారు
దిశ, వెబ్‌డెస్క్: MG మోటార్ కంపెనీ ఇండియాలో కొత్తగా ‘కమెట్ ఎలక్ట్రిక్ కారు’ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని కంపెనీ పేర్కొంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 230 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. కారు 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. దాదాపు 7 గంటల్లోపు పూర్తిగా చార్జ్ అవుతుంది.
కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, రెండు డోర్లు మాత్రమే ఉండి లోపల నాలుగు సీట్లు ఉంటాయి. ఇంకా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, సీట్ బెల్ట్ రిమైండర్, 100కి పైగా వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేసే ఇన్‌బిల్ట్ iSmart సిస్టమ్ మొదలగు ఫీచర్లు ఉన్నాయి.
నగరాలు, పట్టణాల్లో తిరగడానికి అనుకూలంగా ఉండే విధంగా కారును రూపొందించినట్లు MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2 శాతంగా ఉంది, ఇది రాబోయే రోజుల్లో 10 శాతానికి చేరుకుంటుందని ఆయన అన్నారు.
Also Read:
రూ. 8 లక్షల ధరలో 'కమెట్' ఈవీని విడుదల చేసిన ఎంజీ మోటార్ ఇండియా!