Meta: దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్!.. నెట్టింట యూజర్ల ఫిర్యాదులు

by Ramesh Goud |   ( Updated:2024-10-08 07:43:59.0  )
Meta: దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్!.. నెట్టింట యూజర్ల ఫిర్యాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. దీనిపై యూజర్లు నెట్టింట ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం నెలకొంది. గత కొద్ది సేపటి నుంచి ఈ యాప్ పనిచేయడం లేదు. దీంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అకౌంట్లు ఏమైనా హ్యాక్ కు గురయ్యాయా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యాప్ ని తీసేసి.. రీ ఇన్‌స్టాల్ చేయడం లాంటివి చేసినా లాభం లేకుండా పోయింది. ఇన్ స్టాగ్రామ్ సేవలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో సంస్థపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెటా సంస్థ వెంటనే స్పందించాలని ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో రిక్వెస్ట్ లు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలే ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చని యూజర్లు భావిస్తున్నారు. దీనిపై మెటా సంస్థ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed