- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితా.. జెఫ్ బెజోస్ ను దాటేసిన మార్క్ జుకర్ బర్గ్
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో.. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 2వ స్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ నికర సంపద 200 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో ఉండగా.. 265 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ టాప్ ప్లేస్ లో నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సెకండ్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి మార్క్ జుకర్ బర్గ్ వచ్చాడు.
గురువారం మెటా ప్లాట్ ఫారమ్ ల షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడంతో.. మార్క్ జుకర్ బర్గ్ నికర ఆస్తుల విలువ పెరిగింది. జెఫ్ బెజోస్ ను వెనక్కు నెట్టి.. 206.2 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో జుకర్ రెండోస్థానంలో నిలిచారు. ఎలాన్ మస్క్ కంటే 50 బిలియన్ డాలర్లు వెనుకబడి ఉన్నారు.
ఏఐ చాట్ బాట్ లను శక్తివంతం చేసే అన్ని రకాల భాషల మోడల్స్ ను పుష్ చేయడంతో గురువారం మెటా షేర్లు ఊపందుకున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మెటా షేర్లు 23 శాతం పెరిగినట్లు బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. నిన్న మెటా షేర్లు 582.77 బిలియన్ల డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. కాలిఫోర్నియాకు చెందిన మెన్లో పార్క్ లో జుకర్ కు 13 శాతం వాటా ఉంది. దాని నుంచి కూడా ఆయనకు ఆదాయం సమకూరుతుండగా.. ఈ ఏడాదిలో అతని సంపద 78 బిలియన్ డాలర్లు పెరిగింది.