రిలయన్స్‌ భాగస్వామ్యంతో లాభాలు ఎక్కువ, రిస్క్ తక్కువ

by S Gopi |
రిలయన్స్‌ భాగస్వామ్యంతో లాభాలు ఎక్కువ, రిస్క్ తక్కువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో త భారత వ్యాపారాన్ని విలీనం చేయడం వల్ల జాయింట్ వెంచర్ కంపెనీకి లాభాల పరంగా మేలు జరగడమే కాకుండా భారత మార్కెట్లో వ్యాపారానికి రిస్క్ తక్కువగా ఉంటుందని వాల్‌డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ వెల్లడించారు. ఈ విలీన ఒప్పందం ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒక పెద్ద సంస్థ ఏర్పడుతుంది. అది మార్కెట్లో లీడర్‌గా కొనసాగుతుంది. మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న బాబ్ ఐగర్, 'అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా భారత్‌లో రిలయన్స్‌తో ఒప్పందం చేసుకునే అవకాశం లభించింది. దిగ్గజ సంస్థగా ఉన్న రిలయన్స్‌తో కలిసి ఒక పెద్ద సంస్థలో భాగం కావడం ప్రయోజనాలతో పాటు భారత్ లాంటి మార్కెట్లో రిస్క్‌ను తగ్గిస్తుందని భావిస్తున్నాం. 21 సెంచురీ ఫాక్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారత్‌లో తాము పెట్టుబడులు ప్రారంభించాం. దీనివల్ల దేశంలోని అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఒకటిగా నిలిచాం. ఈ క్రమంలోనే రిలయన్స్‌తో ఒప్పందం చేసుకునే అవకాశం లభించింది. దీనివల్ల తమ సంస్థకు మేలు జరగడంతో పాటు రిస్క్ కూడా తగ్గుతుందని' వెల్లడించారు.

ఇటీవల జరిగిన రిలయన్స్, వాల్ట్ డిస్నీ ఒప్పందం విలువ రూ. 70,352 కోట్లు కాగా, ఇరు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి. ఇరు కంపెనీలు కలిసి 120 టీవీ ఛానళ్లతో ఒకే సంస్థగా పనిచేయనున్నాయి. ఈ జేవీకి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తారు.

ఇక, 21 సెంచురీ ఫాక్స్‌ను కొన్న తర్వాత డిస్నీ సంస్థ 2020లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌గా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఐపీఎల్, వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న తర్వాత భారీగా సబ్‌స్క్రైబర్లను సాధించింది. అయితే, 2023-27 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలయన్స్‌కు చెందిన జియో సినిమా సొంతం చేసుకోవడంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కస్టమర్లను కోల్పోయింది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో కొనసాగేందుకు డిస్నీ సంస్థ రిలయన్స్‌తో ఒప్పందం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed