Meesho: పండుగ సేల్‌లో ఫస్ట్ డే రికార్డు ఆర్డర్లను సాధించిన మీషో

by Harish |
Meesho: పండుగ సేల్‌లో ఫస్ట్ డే రికార్డు ఆర్డర్లను సాధించిన మీషో
X

దిశ, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ వచ్చిన నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థ మీషో వినియోగదారుల కోసం అన్ని ఉత్పత్తులపై భారీ ఆఫర్లతో 'మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్' ను తీసుకొచ్చింది. ఈ సేల్ మొదటిరోజు(శుక్రవారం) రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు, రోజువారీ ఆర్డర్‌లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. అలాగే, మొదటి రోజున మొబైల్ యాప్‌లో దాదాపు 6.5 కోట్ల మంది మీషోను వాడినట్లు సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సేల్‌కు ముందు దాదాపు 1.5 కోట్ల యాప్ డౌన్‌లోడ్‌లు నమోదు కాగా, ఆర్డర్‌లు భారీగా పెరిగాయి. వీటిలో దాదాపు 45% కొత్త కస్టమర్‌ల నుండి వచ్చాయి.

మీషో బిజినెస్ జనరల్ మేనేజర్ మేఘా అగర్వాల్ మాట్లాడుతూ, పండుగ సేల్‌లో గత ఏడాది కంటే ఈ సారి మొదటిరోజు రెట్టింపు ఆర్డర్‌లను చూశాం. ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానంగా ప్రజలు మమ్మల్ని విశ్వసించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ప్రస్తుతం పండుగల సీజన్‌లో తమ ప్రత్యర్థులతో పోల్చితే తమకు అత్యధిక సంఖ్యలో విక్రయదారులు ఉన్నారని మీషో తెలిపింది. ఇదిలా ఉంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లు కూడా జరుగుతున్నాయి. అమ్మకాల పరంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు పండుగ సీజన్ విక్రయాలు అత్యంత కీలకం కావడంతో పోటీ పడి మరి ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed