- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16,000 మారుతీ సుజుకి కార్ల రీకాల్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. 2019, జూలై 30 నుంచి 2019, నవంబర్ 1 మధ్య కాలంలో తయారైన 11,851 యూనిట్ల బలెనో, 4,190 వ్యాగన్ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఫ్యుయెల్ పంప్ మోటార్ భాగంలో లోపం ఉన్నట్టు సందేహాలు ఉన్నాయని, ఇది చాలా అరుదైన సందర్భాల్లో ఇంజిన్ ఆగిపోయేందుకు లేదా ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలకు దారితీస్తుందని మారుతీ సుజుకి వివరించింది. ఈ లోపం ఉన్నట్టు అనుమానం ఉన్న కార్ల యజమానులను త్వరలో సంప్రదిస్తామని, నిర్ణీత సమయంలో ఉచితంగా విడి భాగాన్ని అమర్చి ఇవ్వనునట్టు తెలిపింది. దీనికోసం కంపెనీ డీలర్ వర్క్‌షాప్ సిబ్బంది సంప్రదిస్తారని పేర్కొంది. గతేడాది ఇదే నెలలో మారుతీ సుజుకి మొత్తం 1,72,321 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. గత నెల మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 9 శాతం వృద్ధితో 1,60,271 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే నెలలో 1,47,467 యూనిట్లు అమ్ముడయినట్టు పేర్కొంది.