Maruti Suzuki : 87,599 ఎస్-ప్రెస్సో, ఈకో కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

by Vinod kumar |   ( Updated:2023-07-24 14:23:16.0  )
Maruti Suzuki : 87,599 ఎస్-ప్రెస్సో, ఈకో కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఎస్-ప్రెసో, ఈకో మోడల్ కార్లను భారీ సంఖ్యలో రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మోడల్ కార్లలో స్టీరింగ్‌లో సమస్య ఉన్న కారణంగా మొత్తం 87,599 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. 2021, జూలై 5 నుంచి 2023, ఫిబ్రవరి 15వ తేదీల మధ్య తయారైన కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఆయా కార్లలో స్టీరింగ్ టై రాడ్‌లో లోపం ఉన్నట్టు గుర్తించామని, దీనివల్ల కొన్ని సందర్భాల్లో వాహన హ్యాండ్లింగ్ దెబ్బతినవచ్చని కంపెనీ వివరించింది. రీకాల్‌ చేసిన వాహనాలను పరిశీలించి అవసరమైతే ఉచితంగా సంబంధిత విడిభాగాలను అమరుస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఆయా తేదీల్లో తయారైన వాహనాలను కొనుగోలు చేసిన వారికి వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed