కిలో CNGతో 32.85 కి.మీ మైలేజ్‌.. రూ. 8.19 లక్షలకే మారుతీ సుజుకి కొత్త కారు

by Harish |
కిలో CNGతో 32.85 కి.మీ మైలేజ్‌.. రూ. 8.19 లక్షలకే మారుతీ సుజుకి కొత్త కారు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా మార్కెట్లోకి CNG కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్విఫ్ట్‌ వేరియంట్‌లోనే అధిక ఇంధన సామర్ధ్యంతో S-CNG‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 8.19 లక్షలు(ఎక్స్-షోరూమ్). ముఖ్యంగా ఈ కారు కిలో CNGతో 32.85 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ లాంచ్‌లో భాగంగా ప్రకటించింది. కొత్త లాంచ్‌తో, కంపెనీ తన సెగ్మెంట్‌లో దేశీయ అత్యంత ఇంధన-సమర్థవంతమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. కంపెనీ ఇప్పటికే దాని పోర్ట్‌ఫోలియోలో 14 CNG మోడల్‌లను కలిగి ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్‌ను విడుదల చేసిన నాలుగు నెలల తర్వాత ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

కొత్త స్విఫ్ట్ CNG 1.2-లీటర్ Z-సిరీస్ డ్యూయల్ VVT ఇంజన్‌ను కలిగి ఉంది, ఇది గరిష్టంగా 69.75PS పవర్, 101.8Nm పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ను అందిస్తుంది. కారు లోపల 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ చార్జర్, సుజుకి కనెక్ట్ సూట్, వెనుక AC వెంట్‌లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+ (ESP), హిల్ హోల్డ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది V, V(O), Z వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. VXi CNG- 8.19 లక్షలు, VXi (O) CNG- 8.4 లక్షలు, ZXi CNG- రూ. 9.19 లక్షలు. అన్ని వేరియంట్లలో కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించారు.

Advertisement

Next Story