- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్‌యూవీ 'థార్' ధరను రూ. లక్షకు పైగా పెంచిన మహీంద్రా!
by Javid Pasha |
X
న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ మోడల్ థార్ ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. వేరియంట్లను బట్టి ధరను రూ. 1.05 లక్షల వరకు పెంచినట్టు కంపెనీ తెలిపింది. వాహనాలను బీఎస్6 2.0, కొత్త ఉద్గార నిబంధనలకు మార్చేందుకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ తెలిపింది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, థార్ ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ వేరియంట్ ధర రూ. 55 వేలు, థార్ ఎల్ఎక్స్ డీజిల్ వేరియంట్ రూ. 1.05 లక్షలు పెరిగింది. ఈ మోడల్‌లో ఇతర వేరియంట్లు రూ. 28 వేల వరకు ఖరీదయ్యాయి. దాంతో మహీంద్రా థార్ టాప్ వేరియంట్ ఎల్ఎక్స్ రూ. 16.77 లక్షలకు అందుబాటులో ఉందని, బేస్ వేరియంట్ ధర రూ. 13.49 లక్షలుగా ఉందని కంపెనీ వెల్లడించింది.
Advertisement
Next Story