సంస్థ పేరుతో నకిలీ యాడ్స్‌.. పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక

by Dishanational1 |
సంస్థ పేరుతో నకిలీ యాడ్స్‌.. పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రజలకు, పాలసీదారులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీతో పాటు సంస్థకు చెందిన కొందరు సీనియర్ అధికారుల పేర్లలో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న నకిలీ, మోసపూరిత యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బుధవారం ప్రకటనలో హెచ్చరించింది. అలాంటి యాడ్స్ ఎక్కువగా ప్రచారంలో ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు, పాలసీదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 'కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు, కంపెనీలు ఎల్ఐసీ పేరు మీద మోసపూరితమైన యాడ్స్ రూపొందించాయి. అందులో అధికారిక అనుమతుల్లేకుండా సంస్థతో పాటు సంస్థలోని సీనియర్ అధికారుల పేర్లను, ఫోటోలను, బ్రాండ్ పేరు, లోగోలను సైతం వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి సమాచారమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే సంస్థ బ్రాంచును నేరుగా సంప్రదించాలని, ఇటువంటి మోసపూరిత యాడ్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మంచిదని' ఎల్ఐసీ బహిరంగ ప్రకటన వెలువరించింది. బ్రాంచును నేరుగా వెళ్లే వీల్లేని వారు మోసపూరిత యాడ్స్‌కు సంబంధించిన లింక్‌లను ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాకు పంపాలని కోరింది. అటువంటి యాడ్స్‌ను రూపొందించే వారిపై సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.



Next Story

Most Viewed