మహిళలకు గుడ్‌న్యూస్: రోజుకు 60 రూపాయలతో రూ. 8 లక్షలకు పైగా ఆదాయం

by Harish |   ( Updated:2023-06-27 14:20:26.0  )
మహిళలకు గుడ్‌న్యూస్: రోజుకు 60 రూపాయలతో రూ. 8 లక్షలకు పైగా ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక ప్లాన్ వినియోగదారులకు మంచి పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. దాని పేరే 'LIC ఆధార్ శిలా ప్లాన్'. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే ఉద్దేశించినది. సమాజంలో మహిళలకు ఆర్థికంగా భరోసా అందించేందుకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. బీమాతో అదనంగా పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. ఆధార్ శిలా ప్లాన్ అనేది మహిళల కోసం రూపొందించబడిన ఎండోమెంట్, నాన్-లింక్డ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. పాలసీ సమయంలో పాలసీదారు మరణిస్తే, వారి నామినికీ డెత్‌బెనిఫిట్స్ అందిస్తారు. అలాగే, ఈ పథకం కింద రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

ఈ పథకంలో 8 నుండి 55 సంవత్సరాల లోపు వయస్సు గల స్త్రీలు ఎవరైనా చేరవచ్చు. పాలసీ మెచ్యూరిటీ సమయం పది నుంచి ఇరవై ఏళ్ల మధ్య ఉంటుంది. మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలుగా ఉంది. ఆధార్ శిలా ప్లాన్‌లో కనీస ప్రాథమిక మొత్తం రూ.75,000 ఉంది. అలాగే గరిష్టంగా రూ. 3 లక్షల ప్రాథమిక మొత్తాన్ని అందిస్తారు. ప్రీమియం చెల్లింపులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చెల్లింపులు చేయవచ్చు.

ఉదాహరణకు, రోజు రూ. 60 కు పైగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఏడాదికి రూ. 21,960కి పైగా అవుతాయి. 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం 4.39 లక్షలకు పైగా అవుతుంది. ఈ విధంగా, 20 సంవత్సరాల తర్వాత, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు, రూ. 8 లక్షలకు పైగా పొందుతారు. ఇతర పూర్తి వివరాల కోసం LIC బ్రాంచ్ లేదా ఏజెంట్‌ను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed