- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Financial Planning: ప్రతి ఏటా లక్షన్నర ఆదా చేసుకునే అవకాశం.. మీ పిల్లల భవిష్యత్ కోసం ఇలా చేయండి

దిశ, వెబ్‌డెస్క్: Financial Planning: పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. వారి చదువులు, పెళ్లిళ్లు, కెరీర్ కోసం ఇప్పటి నుంచే డబ్బు పోగుచేస్తుంటారు. ఈ బాధ్యతలు ప్రతి తల్లిదండ్రులకూ ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే తెలివిగా పిల్లల కోసం చేసే సేవింగ్స్ నుంచి పన్ను ప్రయోజనాలను పొందుతారు. ఇలా పిల్లల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది నిర్మించడంతోపాటు కావాల్సినంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. పన్ను భారాన్ని తగ్గించుకుంటూ పెట్టుబడి రాబడిని పెంచుకోవచ్చు. నిపుణులు అందిస్తున్న ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ(Tax Savings Investment Strategy) గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY):
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఈ రెండూ అధిక భద్రత, మంచి వడ్డీ రేట్లను అందించే ప్రభుత్వ స్కీములు. ఈ స్కీముల్లో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా అసలు, వడ్డీ రెండూ పూర్తిగా టాక్స్ లేకుండా ఉంటాయి. అయితే ఎస్ఎస్వై ఆడపిల్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్:
ఈ స్కీములలో మెచ్యూరిటీ సమయంలో సంపాదించిన వడ్డీపై పన్ను చెల్లించాలి. మీరు సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్:
ఈ స్కీము ఆర్థిక సంవత్సరానికి రూ.10,000 వరకు వడ్డీ ఆదాయాలపై పన్ను మినహాయింపును అందిస్తుంది.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (ULIPs):
ULIPs పెట్టుబడి, లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండింటినీ కలిపి అందిస్తాయి. ఆర్థిక భద్రతతో పాటు మార్కెట్-లింక్డ్ రిటర్న్స్ ను కూడా పొందవచ్చు. మీరు సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్ కొన్ని పరిమితులలోపు ట్యాక్స్ లేకుండా ఉంటాయి.
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS):
ELSS మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది. ELSSకి మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. NSC లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లతో పోలిస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
అదనపు పన్ను ప్రయోజనాలు:
సెక్షన్ 80C మైనర్లకు PPF, SSY, 5 ఇయర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల వంటి పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకు యాన్యువల్ డిడక్షన్స్ అందిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది.