Ladakh Tour :సమ్మర్‌లో లడఖ్ అందాలు చూడాలనుకుంటున్నారా.. అయితే IRCTC స్పెషల్ ప్యాకేజీ మీకోసమే!

by Harish |   ( Updated:2023-04-27 15:48:04.0  )
Ladakh Tour :సమ్మర్‌లో లడఖ్ అందాలు చూడాలనుకుంటున్నారా.. అయితే IRCTC స్పెషల్ ప్యాకేజీ మీకోసమే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మండు వేసవిలో చల్లని ప్రదేశం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది లడఖ్ మాత్రమే. చాలా మంది ఈ ప్లేస్‌ను ఒక్కసారైనా సందర్శించాలనుకుంటారు. చలి కాలంలో కంటే వేసవిలో ఇక్కడికి టూరిస్ట్‌లు అధికంగా వస్తుంటారు. ఇప్పుడు వేసవి రానే వచ్చింది. దీంతో టూరిస్ట్‌లు క్రమంగా లడఖ్ బాట పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్‌ను తీసుకొచ్చింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. లడఖ్‌లో ఎక్కడ స్టే చేయాలి, ఏఏ ప్రదేశాలను చూడాలి మొదలగు అన్నింటిని కూడా IRCTC చూసుకుంటుంది.



* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి మే 4న టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ 6 రాత్రులు, 7 రోజులు ఉంటుంది. మొదటిరోజు ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరితే మధ్యాహ్నం 12.30 గంటలకు లేహ్ చేరుకుంటారు. తరువాత కాసేపు రెస్ట్ తీసుకుని ఆ రోజు అక్కడ దగ్గర ఏరియాలో కొన్ని ప్రదేశాలను చూడాలి. రాత్రి అక్కడే స్టే చేయాలి.



* రెండో రోజు ఉదయం బ్రెక్‌ఫాస్ట్ చేశాక, లేహ్-శ్రీనగర్ హైవేలో ఉన్నటువంటి భారత ఆర్మీ నిర్మించిన మ్యూజియం హాల్ ఆఫ్ ఫేమ్, జోరావార్ ఫోర్ట్, గురుద్వారా పత్తర్ సాహిబ్, శాంతి స్తూప, లేహ్ ప్యాలెస్ చూడవచ్చు. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ హిల్ చూస్తారు. ఆ రాత్రి లేహ్‌లో బస చేయాలి. మూడో రోజు నుబ్రా వ్యాలీ‌కి వెళ్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత అక్కడి ప్రజల జీవన శైలిని చూడటానికి సైట్ సీయింగ్, దీక్షిత్, హందర్ గ్రామాలను, మఠాలను సందర్శిస్తారు. తరువాత హోటల్‌కి తిరిగి వెళ్ళి, నుబ్రా వ్యాలీలో రాత్రి బస చేస్తారు.


* నాలుగో రోజు ఉదయం బ్రెక్‌ఫాస్ట్ తరువాత 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారతదేశం గెలుచుకున్న గ్రామం అయిన టుర్టుక్ విలేజ్‌ను సందర్శిస్తారు. దాని తర్వాత సియాచిన్ వార్ మెమోరియల్, థంగ్ జీరో పాయింట్, టుర్టుక్ గ్రామం, బాల్టీ హెరిటేజ్ హౌజ్, మ్యూజియం, నేచురల్ కోల్డ్ స్టోరేజ్ చూడచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో స్టే చేయాలి.


* ఐదో రోజు పాంగోంగ్‌కు వెళ్తారు. పాంగోంగ్ సరస్సు 120 కి.మీ పొడవు, 6 - 7 కి.మీ వెడల్పు కలిగిన ఉప్పు నీటి ప్రదేశం. సరస్సులో 2/3 చైనా ఆధీనంలో ఉంది. త్రీ ఇడియట్స్ సినిమా షూట్ చేసిన లొకేషన్ చూడొచ్చు. రాత్రికి పాంగాంగ్‌లో బస చేయాలి. ఆరో రోజు ఉదయం పాంగాంగ్ లేక్‌లో అందమైన సూర్యోదయాన్ని చూడొచ్చు.


* ఆరో రోజు అల్పాహారం తర్వాత, లేహ్‌కు తిరిగి వెళ్తారు. దారి మధ్యలో థిక్సీ మొనాస్ట్రీ, షే ప్యాలెస్, రాంచో స్కూల్ చూడచ్చు. లేహ్‌కు చేరుకున్నాక, అక్కడ స్టే చేయాలి. ఆ రోజు సాయంత్రం లోకల్ మార్కెట్లో షాపింగ్ చేయవచ్చు. ఏడో రోజు రిటర్న్ జర్నీ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్‌లో బయల్దేరితే రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.



మొత్తం 6 రాత్రులు, 7 రోజుల టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ధర ప్రకారం, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.54,500, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.48,560, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.47,830 చెల్లించాలి. ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా విమాన టికెట్స్, హోటల్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, వాటర్ బాటిల్, సైట్ సీయింగ్ వెహికల్ మొదలగునవి కవర్ అవుతాయి.

Also Read..

షిర్డీ యాత్రికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌ న్యూస్

Advertisement

Next Story

Most Viewed