KTM 250 Duke: కేటీఎం ఇయర్ ఎండ్ సేల్.. డ్యూక్‌పై 20 వేల తగ్గింపు..!

by Maddikunta Saikiran |
KTM 250 Duke: కేటీఎం ఇయర్ ఎండ్ సేల్.. డ్యూక్‌పై 20 వేల తగ్గింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రియా(Austria)కు చెందిన ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ కేటీఎం(KTM) కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ మోడల్ కేటీఎం 250 డ్యూక్(KTM 250 Duke)పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ ఆఫర్(Year End Offer)లో భాగంగా డ్యూక్ బైక్ పై రూ. 20,000 వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. కాగా కేటీఎం 250 డ్యూక్ ను ఈ ఏడాది ప్రారంభంలో రూ. 2,45,000(EX-Showroom) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ బైక్ 2,25,000కే లభించనుంది. ఇయర్ ఎండింగ్ సమయంలో ఎక్కువ అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ బైక్ అట్లాంటిక్ బ్లూ, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, సిరామిక్ వైట్, ఎబోనీ బ్లాక్ అనే ఫోర్ డిఫరెంట్ కలర్స్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. కేటీఎం 250 డ్యూక్ 248సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్(Liquid cool Engine)ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 9,250 rpm వద్ద 30 హార్స్ పవర్(Hp), 7,250 వద్ద 25 Nm గరిష్ట టార్క్(Torque)ను రిలీజ్ చేస్తుంది. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉన్నాయి. ఇక ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌, బ్యాక్ సైడ్ మోనోషాక్ సెటప్ ను పొందుతుంది. అలాగే డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. మరోవైపు 5 ఇంచెస్ TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హెడ్‌సెట్ కనెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed