- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kia Sonet: కియా సోనెట్ కొత్త రికార్డు.. లాంచ్ చేసిన 11 నెలల్లోనే లక్షకు పైగా కార్లు సేల్..!
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాకు(South Korea) చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా(Kia) కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. మారుతున్న టెక్నాలిజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే కియా తాజాగా కార్ల విక్రయాల్లో రికార్డు సృష్టించింది. తన కంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్(Sonet) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన 11 నెలల్లోనే 1,03,353 యూనిట్ల కార్లను విక్రయించింది. ప్రతి నెల సగటున 10,000 కార్లను సేల్ చేసినట్లు కంపెనీ శనివారం అధికారికంగా వెల్లడించింది. మొత్తం కియా సోనెట్ కార్ల విక్రయాల్లో పెట్రోల్(Petrol) వేరియంట్లు 76 శాతం, డీజిల్(Diesel) వేరియంట్లు 24 శాతం సేల్ అయ్యాయని తెలిపింది. కాగా అప్‌డేటెడ్ సోనెట్ మోడల్ కారును కియా ఈ ఏడాది జనవరి 12న దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. మొత్తం ఏడు వేరియంట్లలో దీన్ని విడుదల చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 7,99,000కాగా.. టాప్ ఎండ్ మోడల్ ధరను రూ. 15,69,000గా కంపెనీ నిర్ణయించింది. టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ కార్లకు పోటీగా దీన్ని రిలీజ్ చేశారు.