కార్ల ధరలను పెంచిన కియా మోటార్స్.. ఈ తేదీ నుంచే అమల్లోకి

by Harish |
కార్ల ధరలను పెంచిన కియా మోటార్స్.. ఈ తేదీ నుంచే అమల్లోకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ముడిసరుకులు, సరఫరా, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని కియా ఇండియా నేషనల్ హెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. కస్టమర్లకు ప్రీమియం, సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడానికి కంపెనీ స్థిరంగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. కియా కంపెనీ తన కార్ల ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. కంపెనీ ప్రస్తుతం సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి మోడళ్లను విక్రయిస్తుంది. కియా భారత్, విదేశీ మార్కెట్లలో కలిపి ఇప్పటి వరకు దాదాపు 1.16 మిలియన్ యూనిట్లను విక్రయించింది.

Advertisement

Next Story