- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చిన్న పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభం పొందాలనుకునే వారికి మొదటగా గుర్తుకు వచ్చేది అంటే మ్యూచ్‌వల్ ఫండ్స్ మాత్రమే. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకుంటాయి. ప్రజలు దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న కూడా అందులో కొన్ని సార్లు నష్టాలు అధికంగా వస్తాయి. మరికొన్ని సార్లు ఎవరూ ఊహించలేనంత లాభాలు వస్తాయి. రిస్క్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో మాత్రం అలా ఉండదు. పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుంది. కాకపోతే దీనిలో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ ప్రాతిపదికన అయితే మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఎలాంటి లాభం పొందలేరు.
ఇన్వెస్ట్‌మెంట్:
మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ప్రజలు సులభంగా పెట్టుబడులు పెట్టే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లేకుండా ఆన్‌లైన్ విధానంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం చాలా రకాల కంపెనీలు ప్రత్యేకమైన యాప్‌లు, సైట్‌లను తీసుకొచ్చాయి. వివిధ పేమెంట్ యాప్స్, ఈ కామర్స్ సైట్లు మ్యూచువల్ ఫండ్స్ అప్లికేషన్‌ను అందిస్తున్నాయి. ప్రతి నెలా రూ. 500 నుంచి కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సిప్(సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానం ద్వారా ఎంతో కొంత అమౌంట్‌ను మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.
మ్యూచ్‌వల్ ఫండ్ రకాలు:
ఎలాంటి నష్ట భయం లేకుండా దీర్ఘకాలిక రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బాగా ఉపయోగపడుతాయి. దీనిలో ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ అనే మూడు రకాల పెట్టుబడి ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలను లార్జ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు, ఉదా: రిలయన్స్, ITC మొదలైనవి.
మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ కంపెనీలు ఆదాయం మధ్యస్తంగా ఉంటుంది. మీ చేతిలో ఉన్న డబ్బుల ఆధారంగా ఈ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ మొత్తం నిధులు అవసరం. మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ అయితే షేర్ల విలువ కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో కూడా అధిక షేర్లను పొందవచ్చు.
ఎంపిక విధానం:
పెట్టుబడులో ముఖ్యం ఎక్కువ రాబడి ఇచ్చే కంపెనీలను ఎంచుకోవడం. అలాగే, మ్యూచువల్ ఫండ్ డిస్టిబ్యూటర్ ట్రాక్ రికార్డు, వారి గత పెట్టుబడుల వివరాల ఆధారంగా మదింపు చేయడం ఉత్తమం. ఫండ్ మేనేజర్ ఎక్కువ లాభాలు ఇచ్చే సురక్షితమైన కంపెనీలను ఎంచుకుని వాటిలో మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు. అతనికి ఏ ఏ కంపెనీలలో పెట్టుబడులు పెడితే ఎక్కువ రాబడి వస్తుందో ముందే ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి వారి గురించి తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల కంపెనీలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు అనుభవం కలిగిన ఫండ్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. అలాంటి కంపెనీలు దీర్ఘకాలంలో మంచి రాబడి ఇస్తాయి.
ఎలా పెట్టుబడి పెట్టాలి:
ఒకప్పటి లాగా కాకుండా ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టడం చాలా సులభం అయింది. ఆన్‌లైన్ లేదా ఫండ్ మేనేజర్/డిస్టిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ అయితే KYC వెరిఫికేషన్ పూర్తి చేయడం దగ్గరి నుంచి అన్ని కూడా డిస్టిబ్యూటర్ చూసుకుంటాడు. లేదంటే ఇప్పుడు ఉన్న యాప్స్, ఫండ్స్ సైట్‌ల ద్వారా డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆన్ లైన్ లో e-KYC కూడా చేయవచ్చు
రాబడి:
మ్యూచువల్ ఫండ్ రాబడి అనేది ఎంచుకున్న ఫండ్, సమయం పై ఆధారపడుతుంది. దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఇన్వెస్ట్ చేసినట్లయితే లాభాలు వస్తాయి. బ్యాంక్‌లు, పోస్ట్ ఆఫీసులు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ పొందవచ్చు. కానీ దీనికి పూర్తి గ్యారంటీ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్‌లో నష్టం వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఉదా: సిప్ విధానంలో రూ. 2000 ప్రతి నెలా ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ తో 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రూ. 20 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది.